యుపిఎతో కరుణానిధి తెగదెంపులు?, 13న ఢిల్లీకి జయలలిత

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె నేతలు ఎ రాజా, కనిమొళిలు ఇప్పటికే జైలు పాలయ్యారు. మరో నేత దయానిధి మారన్ మెడకూ అది చుట్టుకుంటోంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇప్పటికే దయానిధి మారన్‌కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. డిఎంకె యుపిఎ నుంచి వైదొలిగే అవకాశాలున్న నేపథ్యంలో అన్నాడియంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆమె ప్రధాని మన్మోహసింగ్‌ను, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలుస్తారు.












Click it and Unblock the Notifications