హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం రావాలని లేదా: కెసిఆర్, కిషన్‌రెడ్డిలకు ఎర్రబెల్లి ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలకు లేదా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణ వద్దని అనుకునే వారే టిడిపి సభలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం రావాలంటే తెలంగాణలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు జెండాలు పక్కన పెట్టి తెలంగాణ అజెండాతో ముందుకు రావాలని ఆయన సూచించారు. తెలంగాణవాదులంతా ఏకత్రాటి పైకి రావాలని ఆయన అన్నారు.

కెసిఆర్ కాంగ్రెసు ఏజెంటు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ కెసిఆర్ ఏజెంటు అని ఆయన ఆరోపించారు. కెసిఆర్ కబందహస్తాల నుండి కోదండరామ్ బయట పడాలన్నారు. కెసిఆర్, కిషన్ రెడ్డిలతో సహా తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలలో పాల్గొనమని ముందుకు వస్తే అందుకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ కోసం టిడిపి రాజీనామాకు కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే తెలంగాణలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా అందుకు ముందుకు రావాలన్నారు. టిఏజెఏసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని లేదంటే మేమే ఏర్పాటు చేస్తామని ఆ సమావేశానికి ఎవరు రాకున్నా తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.

English summary
TDP senior MLA Errabelli Dayakar Rao questioned TRS president K Chandrasekhar Rao and BJP president Kishan Reddy on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X