తెలంగాణ వచ్చే ఎన్నికలకు దూరం: కెసిఆర్‌కు టిడిపి సవాల్
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎల్ రమణ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కె చంద్రశేఖరరావుకు సవాల్ విసిరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఏ ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండటానికి మేం సిద్ధమని అందుకు మీరు సిద్ధమా అని రమణ కెసిఆర్‌కు సవాల్ విసిరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ కెసిఆర్ కబంద హస్తాల నుండి బయటకు వచ్చి ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించగలుగుతామని సూచించారు.
కాంగ్రెసు పార్టీకి కెసిఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్త కాదన్నారు. వారికి కెసిఆర్ ఎన్ని డెడ్ లైన్లు పెట్టారో ఆయనకే గుర్తు లేక పోవచ్చని అన్నారు. తామంతా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ జెండాతోనే తెలంగాణ ఉద్యమం చేస్తామని, పార్టీలో ఉంటూనే తెలంగాణ సాధిస్తామని అన్నారు.