డిఎస్ నుండి సత్తిబాబుకు: పిసిసి బాధ్యతలు స్వీకరించిన బొత్స

కాగా అంతకుముందు తన ఇంటి వద్ద నుండి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భారీ ర్యాలీతో బయలు దేరారు. మార్గమధ్యంలో దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, జగ్ జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి గాంధీభవన్ చేరుకున్నారు. కొత్త సారథి కోసం గాంధీ భవన్ సర్వాంగ సుందరంగా తయారయింది. గత పిసిసి అధ్యక్షులు ఎవరూ చేపట్టనంత ఆర్భాటంగా బొత్స పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. బొత్సతో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. బొత్స ర్యాలీ కారణంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది.












Click it and Unblock the Notifications