మరోసారి కెసిఆర్ రాజీనామా, పార్లమెంటు సమావేశాలే వేదిక?

కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు రాజీనామాలకు ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థితిలో తెలంగాణ కోసం రాజీనామా చేసే దమ్ము వారికి లేదని ధ్వజమెత్తుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా కేసీఆర్ రాజీనామాకు సిద్ధపడతారంటున్నా రు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన కేసీఆర్ మరోసారి రాజీనామా చేయడం ద్వారా తెలంగాణపై తమకే చిత్తశుద్ధి ఉందని చాటి చెబుతారన్నది సమాచారం. గత మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజీనామాకు సిద్ధపడ్డ కేసీఆర్‌ను జేఏసీనే నిలువరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications