వైయస్ జగన్ తలపెట్టిన సాగు పోరు ధర్నాల్లో కాంగ్రెసు ఎమ్మెల్యేలు

YS Jagan
హైదరాబాద్: పార్టీ నాయకత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కాంగ్రెసు శాసనసభ్యులు పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తలపెట్టిన ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతు సమస్యలపై సాగుపోరు పేరున వైయస్ జగన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు సోమవారం ధర్నాలు తలపెట్టారు. సొంత ప్రభుత్వంపైనే పోరుకు సిద్ధపడి జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు ధర్నాల్లో పాల్గొన్నారు. కడప జిల్లాలో నలుగురు శాసనసభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి, ఆమె భర్త, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెసు శాసనసభ్యులు కృష్ణదాస్, పార్వతి పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో కాంగ్రెసు శానససభ్యుడు బాబూరావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో వైయస్ జగన్‌తో పాటు కాంగ్రెసు శాసనసభ్యుడు రవి పాల్గొన్నారు.

కాగా, గుంటూరు జిల్లా కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో అంబటి రాంబాబు, మాకినేని పెదరత్తయ్య పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రెహ్మాన్, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, పోసాని కృష్ణ మురళి, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+