వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రలేమిని దూరం చేసే నైట్‌క్యాప్: వైద్యుల అద్భుత సృష్టి

|
Google Oneindia TeluguNews

Nightcap
మీరు ఇన్సోమ్నియా (నిద్ర లేమి)తో బాధపడుతున్నారా? మానసిక, శారీక ఒత్తిళ్లను మరచి హాయిగా నిద్రపోవడం కోసం స్లీపింగ్ పిల్స్ వాడుతున్నారా? అయితే చింతించకండి, ఇలా నిద్రలేమితో బాధపడేవారి కోసం అమెరికా వైద్యులు ఓ టోపీ (క్యాప్)ను రూపొందించారు. దీన్ని తలకు ధరించి పడుకుంటే సుఖంగా నిద్రపోవచ్చని వారు చెబుతున్నారు. అమెరికారు చెందిన ఓ వైద్య బృందం ఓ 'నైట్‌ క్యాప్'ను డిజైన్ చేసింది. అతిశీతలీకరించిన నీటి ట్యూబులతో వారు ఈ టోపీకి రూపకల్పన చేశారు. దీన్ని శిరస్సుకు ధరించడం మూలాన, ఇది మెదడు నరాలను చల్లబరచి సుఖ నిద్రపట్టేలా చేస్తుందని వారు చెబుతున్నారు.

మెదడులోఉండే 'ప్రీ ఫ్రంటల్‌ కార్టెక్స్‌' అనే భాగాన్ని చల్లబరచడం వలన మెదడుకు విశ్రాంతి లభిస్తుందని, ఫలితంగా హాయిగా నిద్రపడుతుందని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ముఖ్యపరిశోధకుడు ఎరిక్‌ నోఫ్జింగర్‌ తెలిపారు. తాము నిర్వహించిన ఓ అధ్యయనంలో.. నిద్రలేమితో బాధపడేవారిలో కొందరిని ఈ టోపీలు ధరించి నిద్రపొమ్మని, మరికొందరని టోపీలు లేకుండా నిద్రపొమ్మని సూచించామని వారు తెలిపారు. ఈ అధ్యయనంలో టోపీలు ధరించి నిద్రపోయిన వారి సమయంలో 89 శాతం సమయం పూర్తిగా నిద్రలోనే ఉన్నట్లు తేలింది. అయితే నిపుణులు మాత్రం నీటితోని నింపబడిన టోపీలు ఎంత వరకూ సౌకర్యంగా ఉంటాయనే ప్రశ్నను వ్యక్తం చేస్తున్నారు.

English summary
US doctors doctors has devised a cap for who suffering from insomnia. the 'nightcap' filled with tubes of chilled water that calms over-active minds, doctors said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X