జయలలిత వర్సెస్ చిదంబరం, కోర్టు ధిక్కారమని కేంద్ర మంత్రి గుర్రు

Chidambaram
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయం కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, ముఖ్యమంత్రి జయలలితకు మధ్య పోరుగా కూడా మారింది. రాజీనామా చేయాలని తనను డిమాండ్ చేసిన జయలలితపై చిదంబరం మండిపడ్డారు. చిదంబరం 2009 లోకసభ ఎన్నికల్లో అక్రమంగా గెలిచారని, అందుకు రాజీనామా చేయాలని జయలలిత అన్నారు. జయలిలత ప్రకటన కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని చిదంబరం అన్నారు.

తన విజయంపై జయలలిత అభ్యర్థి రాజకన్నప్పన్ హైకోర్టులో పిటిషన్ వేశారని, అది 2009 సెప్టెంబర్ నుంచి కోర్టులో పెండింగులో ఉందని, అందువల్ల జయలలిత ప్రకటన కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని ఆయన అన్నారు. తప్పటడుగుతో ప్రారంభం కావడం జయలలితకు అలవాటు అని, అందువల్ల ఆమె ప్రకటనపై ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని ఆయన అన్నారు.

తన లోకసభ నియోజకవర్గం శివగంగ పరిధిలోని శాసనసభా నియోజకవర్గం గత నెల శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+