హైదరాబాద్: ఈశాన్య భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న జాగ్రీత్ అనే ఉగ్రవాదిని కేంద్ర నిఘా విభాగం అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. జాగ్రీత్ అలియాస్ సుబ్రక్ష బ్రహ్మ ఈశాన్య రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. ఆయనపై చాలా కేసులు నమోదయి ఉన్నాయి. జాగ్రీత్ మంగళవారం ఉదయం కలకత్తా నుండి వచ్చిన ఫ్లైట్ నుండి శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు.
ఈయనపై ఓ కన్నేసిన కేంద్ర నిఘా విభాగం హైదరాబాదులో జాగ్రీత్ దిగగానే అరెస్టు చేసింది. ఇతను బోడో ఉగ్రవాది. కోల్‍కతా నుండి హైదరాబాదు వచ్చిన జాగ్రీత్ నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పట్టుకున్నారు.