హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోమటిరెడ్డి డెడ్‌లైన్, కాదన్న గుత్తా: తెలంగాణపై టి-కాంగ్రెసు తలోమాట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అధిష్టానాన్ని కలవడానికి వెళ్లిన తెలంగాణ కాంగ్రెసు ప్రాంత ప్రజాప్రతినిధులు బుధవారం న్యూఢిల్లీ బయలుదేరే ముందు తలోవిధంగా స్పందించారు. ఒకరు ఇదే ఆఖరు పర్యటన అంటే మరొకరు కాదన్నారు. మరొకరు డెడ్‌లైన్ విధించారు. అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదరరెడ్డి స్పష్టం చేశారు. రాజీనామాలకైనా, ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అని చెప్పారు. తెలంగాణ కోసం ఇదే ఆఖరు పర్యటన అని ఆయన చెప్పారు. కోమటిరెడ్డి సోదరులు ఓ అడుగు ముందుకేసి అధిష్టానానికి డెడ్‌లైన్ విధించారు. జూన్ 31వ తేది వరకు అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేదంటే తర్వాత ప్రత్యక్ష ఉద్యమంలోకి దూకుతామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అధిష్టానం నుండి స్పష్టమైన హామీ తీసుకుంటామని చెప్పారు. పార్లమెంటులో వచ్చే సమావేశాలలో బిల్లు పెట్టే విధంగా కోరతామని చెప్పారు.

కాగా వీరికి భిన్నంగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సాధన కోసం తాము ఎన్నిసార్లు అయిన అధిష్టానంతో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ సాధనలో ఇదే తమ ఆఖరి యాత్ర అని చెప్పలేమన్నారు. కేంద్ర మంత్రి ప్రణబ్‌తో భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఎంపి వివేక్ స్పష్టం చేశారు. అధిష్టానంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. కాగా పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్, వివేక్, రాజయ్య మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభ్యులు రాంరెడ్డి దామోదరరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, కెఎల్ఆర్ ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లారు.

English summary
T-congress leaders giving different statements on Telangana issue. Komatireddy brothers put deadlint to high command, whether MP Gutta said he is not confirmed that it is last tour for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X