వచ్చే మూడు నెలల్లో భారీగా నియామకాల జోరు: మ్యాన్ పవర్
Technology
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో భారత కంపెనీల నియామకాలు జోరుగా సాగనున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా భారత కంపెనీలు నియామకాలపై 'దూకుడు' ధోరణితో ఉన్నట్లు మ్యాన్‌పవర్ అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో పాల్గొన్న భారత కంపెనీల్లో 46 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ.. కంపెనీలు నియామకాలు చేపట్టడం విశేషం. 'ద్రవ్యోల్బణం, ఉద్యోగుల కోసం పెరుగుతున్న గిరాకీ దేశ వ్యాప్తంగా కంపెనీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయినా, దాదాపు అన్ని రంగాల్లో నియామకాల సెంటిమెంట్ 2011 ఏడాది మూడో త్రైమాసికానికి (జులై-సెప్టెంబరు) ఆశావహంగానే ఉంది' అని మ్యాన్‌పవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ పండిట్ తెలిపారు.
భారత్‌తోపాటు బ్రెజిల్, తైవాన్, టర్కీ, సింగపూర్‌లలో నియామకాల ధోరణి బలంగా ఉంది. స్పెయిన్, గ్రీస్, ఇటలీ, ఐర్లాండ్‌లలో చాలా బలహీనంగా.. ప్రతికూల అంచనాలు వ్యక్తం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే మూడు నెలలకు భారత్‌లోనే సెంటిమెంట్ చాలా ఆశావహంగా ఉంది. అయితే.. అంతక్రితం త్రైమాసికం (ఏప్రిల్-జూన్)తో పోలిస్తే తక్కువగా ఉంది. గత త్రైమాసికంలో 51 శాతం భారత కంపెనీలు నియామకాలపై సానుకూలంగా స్పందించాయి' అని మ్యాన్‌పవర్ ఇండియా అధిపతి నమ్ర కిషోర్ తెలిపారు.
Indian employers have the most bullish employment outlook across the world with 46 per cent of them planning to increase their head count in the next three months, even amid inflationary pressures.
Story first published: Wednesday, June 15, 2011, 7:52 [IST]