వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై తేల్చాల్సింది సోనియా గాంధీనే, బంతి ఆమె కోర్టులోనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ‌: తెలంగాణ అంశంపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఢిల్లీకి ఎన్ని చక్కర్లు కొట్టినా ఫలితం లేదని తేలిపోయింది. ఎంత మంది కేంద్ర మంత్రులను, పార్టీ అధిష్టానం నేతలను కలుసుకున్నా ఫలితం లేదని మరోసారి తేలిపోయింది. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ బంతిని సోనియా కోర్టులోకి నెట్టేశారు. రాష్టానికి చెందిన అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని సోనియాపై ఒత్తిడి తేవాలని ఆయన బుధవారం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులతో స్పష్టంగా చెప్పేశారు. తన చేతులో ఏమీ లేదని కూడా ఆయన చెప్పకనే చెప్పారు.

చిదంబరం మాటల్లో మరో విషయం కూడా తెలిసిపోయింది. పార్టీపరంగా తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదని కొత్త మెలిక పెట్టారు. పార్టీపరంగా నిర్ణయం జరగకుండానే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చిదంబరం ప్రకటించారా అనే తెలంగాణ ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలను కూడా సంప్రదించాలని ఆయన అంటున్నారు. ఇదంతా చూస్తుంటే సోనియా తప్ప మరెవరూ తెలంగాణపై తేల్చే ప్రసక్తి లేదనేది అర్థమైపోయింది. సోనియా మనసులో ఏముందనే విషయాన్ని ఎవరూ పసి గట్టలేకపోతున్నారు.

తెలంగాణ అంశాన్ని నీరుగార్చే దిశగానే ఆమె సాగుతున్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పదవుల పంపకం, ఇతరత్రా విషయాల్లో ఆమె కచ్చితంగా శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని అమలు చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే, తెలంగాణ కాంగ్రెసు నాయకుల మీద మాత్రం తెలంగాణ కత్తి వేలాడుతూనే ఉంది. తెలంగాణపై తేల్చాల్సింది సోనియా గాంధీయేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే విధంగా చిదంబరం వ్యాఖ్యలున్నాయి.

English summary
It is clear that except Congress president Sonia gandhi, no other leader will solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X