వైయస్ జగన్ అబద్దం చెప్పి నమ్మించారు!: లగడపాటి రాజగోపాల్

Lagadapati Rajagopal
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతిపై కడప జిల్లా ప్రజలకు అబద్దాన్ని చెప్పి నమ్మించారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే కారణం అన్న అనుమానాన్ని ఆ జిల్లా ప్రజల్లో వైయస్ జగన్ రేకెత్తించారన్నారు. వైయస్ సహజ మరణాన్ని సోనియాపై రుద్దడం సరికాదన్నారు.

సోనియా గాంధీ ఏ కుటుంబానికైతే సాయం చేసిందో ఆ కుటుంబమే ఆమెపై బురద జల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాపై జగన్, ఆయన పార్టీ సోనియాపై జల్లుతున్న బురదను కాంగ్రెసు పార్టీ కార్యకర్తలే తిప్పి కొట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మాట నిజమే అన్నారు. అయితే ఆ పరిస్థితులను తప్పకుండా అధిగమిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+