చిరంజీవి సినిమా ఇప్పుడు లేనట్లేనా? కాంగ్రెసులో ఇమిడే యత్నం

అయితే పీఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత చిరంజీవి రాజకీయాల్లో మరింత బిజీగా మారి పోయాడు. చిరుకు కేంద్రమంత్రి పదవి వస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలా సీనియర్లు, ముఖ్యమంత్రి కోసం పోటీ ఉన్న కాంగ్రెసు పార్టీలో ఇమిడేందుకు ఆయన ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన సినిమాపై దృష్టి పెట్టే అవకాశం లేదని తెలిస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్ ఇటీవల చిరు సినిమాకు తానే నిర్మాతగా ఉంటానని కూడా చెప్పాడు. అయితే చిరు 2014 ఎన్నికల వరకు రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రి స్థాయికి పోటీ ఉన్న వారిని అందరినీ దాటుకొని మెగాస్టార్ కావడానికి ప్రయత్నాలు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు తన ప్రాధాన్యత పెంచుకోవడానికి చిరు తన 150వ చిత్రం తీసి విడుదల చేసే అవకాశము కూడా లేకపోలేదు అనే వారు ఉన్నారు.