లగడపాటి రెచ్చగొట్టకు, పదవులతోనే తెలంగాణ దూరం: ఎంపీ వివేక్
State
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ/వరంగల్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ప్రజలను, తెలంగాణ నేతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఆదివారం హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ వాడు కాబట్టే లగడపాటి ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. లగడపాటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపకుంటే ఊరుకునేది లేదన్నారు. తమకు ప్రత్యేక తెలంగాణే ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో అన్ని పదవులు సీమాంధ్రులకే వెళుతున్నాయన్నారు. మాకు పదవులు అక్కర్లేదని తెలంగాణే ముఖ్యం అన్నారు. పదవులే తెలంగాణను దూరం చేస్తున్నాయన్నారు.
లగడపాటి పిచ్చికుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారని సిరిసిల్ల ఎంపీ రాజయ్య వరంగల్‌లో విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన ప్రతీసారీ లగడపాటి ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో కేంద్రీకృతమై ఉన్న తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకే ఆయనీ వ్యాఖ్యలు చేస్తున్నారన్నా రు. పొరుబాట తిరుగుబాటు కాకముందే పద్ధతి మార్చుకుంటే మంచిదని హిొతవు పలికారు.