కస్టమర్‌ను కత్తితో పొడిచి చంపిన బార్బర్, ప్రకాశం జిల్లాలో దారుణం
Districts
oi-Pratapreddy
By Pratap
|
ఒంగోలు: ప్రకాశం జిల్లా దుర్గిలో క్షణికావేశంలో ఓ హత్య జరిగింది. గడ్డం చేయించుకోవడానికి వచ్చిన ఓ కస్టమర్‌ను బార్బర్ హత్య చేశాడు. అంకమరావు అనే బార్బర్ రమేష్ అనే కస్టమర్‌ను కత్తితో పొడిచి చంపాడు. కటింగ్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగిందని కొందరు చెబుతుండగా, తనకు ముందు గడ్డం చేయాలని రమేష్ పట్టుబట్టడంతో అంకమరావు ఘర్షణకు దిగాడని మరి కొంత మంది చెబుతున్నారు. మొత్తం మీదు ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం బూతులు తిట్టుకున్నారు.
సహనం కోల్పోయిన బార్బర్ తన వద్ద ఉన్న కత్తితో రమేష్‌ను పొడిచాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రమేష్ మరణించాడు. బార్బర్ పరారీలో ఉన్నాడు. చెన్నా హెయిర్ స్టయిల్ షాపులో ఈ ఘటన జరిగింది. రమేష్ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.