రవితేజ 'ఇరుముడి' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈసారి డివైన్ టచ్ అదుర్స్..!

మాస్ మహారాజ రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్నమాటే.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రవితేజ. కర్తవ్యం, సింధూరం, నిన్నే పెళ్లాడతా లాంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను స్టార్ట్ చేశారు రవితేజ. ఆ తర్వాత 1999 లో తొలిసారిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నీకోసం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, విక్రమార్కుడు, కిక్ సినిమాలతో వరుస హిట్స్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగారు.

అయితే ఇటీవలి కాలంలో రవితేజ హీరోగా వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, మిస్టర్ బచ్చన్, ఈగల్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దాంతో ఈ సారి స్టోరీ సెలక్షన్ పై పూర్తి ఫోకస్ పెట్టి ఇరుముడి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. ఇరుముడి చిత్రం నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఎమోషనల్ గా ఉంది. 'హార్ట్ ఆఫ్ ఇరుముడి' పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ ను జూన్ 3న మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో ప్రత్యేకంగా తండ్రి కూతురు సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తోంది.

ఇరుముడి చిత్రం నుంచి తాజాగా మరో బిగ్ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీని ఆగస్టు 21 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్న ఈ సినిమాను రెండు పరిశ్రమల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. తమిళంలో ఇరుముడికట్టు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

RaviTeja Irumudi Release Date Confirmed Grand Theatrical Release Set for August 21 RaviTeja movie

ఇరుముడి చిత్రంలో ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. అలాగే బాలనటి బేబీ నకాస్త్ర కీలక పాత్రలో కనిపించనుంది. ఇరుముడి చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మూవీతో రవితేజ బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+