వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మేల్యేలు టార్గెట్‌గా బొత్స, సిఎం కిరణ్ కుమార్ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్య తీసుకోవడమే లక్ష్యంగా కిరణ్ కుమార్ రెడ్డితో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం సమావేశమయ్యారు. ఇరువురు కలిసి భోజనం చేశారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. వైయస్ జగన్ వెంట నడుస్తున్న పార్టీ శాసనసభ్యులపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వారి పట్ల ఏ విధమైన వైఖరిని అవలంబించాలనే అంశాలపై వారిద్దరు మాట్లాడుకున్నట్లు సమాచారం. రేపో మాపో వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు ఉండవచ్చునని భావిస్తున్నారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం తీసుకుంటారని బొత్స సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై కూడా బొత్సకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై వారు చర్చించుకున్నారు. జిల్లాలవారీగా పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని భావించిన వారు అందుకు అవసరమైన చర్చలు చేపట్టాలని అనుకున్నారు. జిల్లాలవారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించాలని తలపెట్టారు. ఈ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారని బొత్స సత్యనారాయణ చెప్పారు. సమీక్షా సమావేశాల తేదీలను ముఖ్యమంత్రి ఖరారు చేస్తారని కూడా ఆయన చెప్పారు. వైయస్ జగన్ వెంట వెళ్తారని భావిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు.

English summary
PCC President Botsa Satyanarayana met CM Kiran Kumar Reddy to discuss action to be taken against YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X