జగన్ అనంతపురం జిల్లా ఓదార్పు యాత్రలో ఇద్దరు శాసనసభ్యులు
State
oi-Pratapreddy
By Pratap
|
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనంతపురం జిల్లా ఓదార్పు యాత్రలో ఇద్దరు శానససభ్యులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో జగన్ సోమవారం ఓదార్పు యాత్రను ప్రారంభించారు. శాసనసభ్యులు గుర్నాథ రెడ్డి, రామచంద్రా రెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఓదార్పు యాత్రలో కూడా వైయస్ జగన్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తమదేనని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల సందర్భంగా మంత్రులంతా కడప నియోజకవర్గంలో ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించారని, వైయస్ అభిమానులను మంత్రులు మార్చలేకపోయారని ఆయన అన్నారు. వైయస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన అన్నారు. వైయస్ బతికి ఉంటే తాను ఇటువంటి కాంగ్రెసు పార్టీలో ఉన్నానా అని బాధపడి ఉండేవారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పెద్దలతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.