తెలంగాణ వస్తుందని లగడపాటి రాజగోపాల్ భయపడుతున్నారు: గండ్ర
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తెలంగాణ వస్తుందనే భయంతోనే తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణా రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే మతఘర్షణలు జరుగుతాయని లగడపాటి చేసిన వ్యాఖ్యల్లో పస లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన లగడపాటి రాజగోపాల్‌కు సూచించారు.
హైదరాబాదులో తెలంగాణవాదం బలంగా ఉందని వంటూ వార్పూ కార్యక్రమం ద్వారా తేలిపోయిందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు రాష్ట్ర విభజనను సమర్థిస్తున్నారని, హైదరాబాదుపై మోజు పడిన కొంత మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై సీమాంధ్ర నాయకులు ఢిల్లీ వెళ్లవచ్చునని, తమ వాదనను వారు వినిపించవచ్చునని ఆయన అన్నారు.