లడపాటి రాజగోపాల్‌పై భౌతిక దాడులు తప్పవు: గంగుల కమలాకర్
Districts
oi-Pratapreddy
By Pratap
|
కరీంనగర్: తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడం మానుకోకపోతే కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై భౌతిక దాడులు తప్పవని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ఇస్తే మతఘర్షణలు జరుగుతాయని లడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. లగడపాటి రాజగోపాల్‌ను కుక్క కరచిందని, అందుకే రేబిస్ వ్యాధి సోకిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన లగడపాటి రాజగోపాల్‌కు సూచించారు.
తెలంగాణపై రాజకీయ డ్రామాలు అపేద్దామని ఆయన అన్ని పార్టీల తెలంగాణ ప్రజాప్రతినిధులకు సూచించారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేద్దామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఎన్నికలు వచ్చినా తెలంగాణ నాయకులు పోటీ చేయకూడదని ఆయన ప్రతిపాదించారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. విత్తనాలు, ఎరువులు అందడం లేదని ఆయన అన్నారు.