మేం బిర్యానీ తింటాం: హైదరాబాదు వంటావార్పుపై జెసి దివాకర్ రెడ్డి

రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని తెలిపేందుకు త్వరలో ఢిల్లీ వెళతామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ సోమవారం మీడియా ప్రతినిథులకు తెలిపారు. ఈ అంశాన్ని త్వరగా తేల్చాలన్న అభిప్రాయం తమలో ఉందని ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినని, అయితే తెలంగాణ వాదాన్ని వినిపించేందుకు ఆదివారం జరిపిన వంటావార్పు మంచి కార్యక్రమేనని అన్నారు. అధిష్ఠానం, కేంద్రం నిర్ణయం తీసుకునే వరకూ కాంగ్రెస్ నేతలంతా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.