పెళ్లిదాకా వచ్చి ఆగిపోయిన మిస్స్‌డ్ కాల్ పెళ్శి కొడుకు వ్యవహారం

యధావిధిగా పెళ్లికూతురు తరఫువారు పెళ్లికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. ఎందుకైనా మంచిదని పెళ్లికి ఒక రోజు ముందు (శనివారం) పెళ్లికూతురు బంధువులు పుల్లూరు వెళ్లారు. ఇంటి దగ్గర పెళ్లికొడుకు జాడ లేకపోవడంతో వారు పెళ్లికొడుకు తండ్రిని ప్రశ్నించారు. శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్లాడని కనిపించడం లేదని తండ్రి చెప్పడంతో వచ్చిన వారు అవాక్కయ్యారు. విషయాన్ని నాంచారుపల్లికి చేరవేశారు. పెళ్లికూతురుతో సహా అందరూ పుల్లూరు వెళ్లారు. ఏది ఏమైనా తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పెళ్లికూతురు శారద... శ్రీనివాస్ ఇంటి దగ్గర బైఠాయిండంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. రెండు కుటుంబాలూ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications