సత్యసాయి బాబాకు ఆలస్యంగా వైద్య సేవలు, రాహుకాలం పేరుతో..

బాబాను చూసేందుకు బంధువులను కూడా అనుమతించలేదన్నారు. పది రోజుల అనంతరం బంధువుల ఒత్తిడి మేరకు కొందరిని మాత్రమే అనుమతించారని ఆమె తెలిపారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు తప్పులు చేసినట్లు రుజువైతే న్యాయపరంగా చట్టం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ట్రస్టు సభ్యులందరూ ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులేనన్నారు.
ట్రస్టు సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని చేతన రాజు అన్నారు. ట్రస్టులోని అవకతవకలపై ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవాలని తాను డిమాండు చేశానని, అయితే ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించి చేసినవి కావని వివరించారు. యజుర్మందిరం తలుపులు తెరిచే సమయంలో కూడా తమకు ఎలాంటి ఆహ్వానం లేదన్నారు.












Click it and Unblock the Notifications