భార్యను నరికి చంపిన భర్త: మరోచోట గర్భీణీపై గొడ్డలితో భర్త దాడి
Districts
oi-Srinivas G
By Srinivas
|
శ్రీకాకుళం/మహబూబ్ నగర్: కూతురు పుడుతుందని ఓ చోట, మరో చోట భార్యలను భర్త నరికిన సంఘటనలు వేరు వేరు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో ఓ వ్యక్తి తనకు కూతురు పుడుతుందనే అనుమానంతో తన భార్యను గొడ్డలితో నరికాడు. గర్భిణీ అయిన తన భార్య కూతురుకు జన్మనిస్తుందని భావించిన ఆ వ్యక్తి తన భార్యను దారుణంగా నరికాడు.
అయితే తీవ్రగాయాలతో కొట్టుకుంటున్న భార్యను స్థానికులు హైదరాబాదులోని ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దివానిపాలెంలో బాగా తాగొచ్చిన భర్త తాగిన మైకంలో తన భార్యను గొడ్డలితో నరికాడు. దీంతో భార్య అక్కడిక్కకడే మరణించింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.