వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత దౌత్యవేత్త లైంగిక వాంఛ తీర్చమన్నాడు: మాజీ పనిమనిషి ఆరోపణ

సంతోష్ భరద్వాజ్ ఆరోపణలను దయాళ్ కొట్టిపారేశారు. తనకు వ్యతిరేకంగా అబద్దాలు చెబుతోందని ఆయన అన్నారు. మెసేజ్ ఇస్తే అదనపు సొమ్ము చెల్లిస్తానని తాను చెప్పినట్లు, ఇది లైంగిక వాంఛ తీర్చుకునే కోరికను వెల్లడించిందని భరద్వాజ్ ఆరోపించడం అంతా తప్పు అని ఆయన అన్నారు. భరద్వాజ్ 2010 జనవరిలో పారిపోయిందని, కాన్సులేట్ బయట పని చేసి మరింత సొమ్ము సంపాదించాలనే ఆమె ఉద్దేశ్యాన్ని తాను తోసి పుచ్చానని, కాన్సులేట్‌లో పనిచేస్తున్నప్పుడు మరో చోట పనిచేయడాన్ని వీసా అనుమతించదని ఆయన వివరించారు. భరద్వాజ్ స్టోర్ రూంలో పడుకోలేదని, మాన్‌పట్టన్‌లోని కాన్సులేట్ భవనం ఐదో అంతస్థులో ఆమెకు గది ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ గదిలో ఆమె దర్జాగా అనుభవించిందని ఆయన చెప్పారు.