సిఎం కాన్వాయ్‌లో గందరగోళం, ఢీకొన్న ప్రైవేటు వాహనాలు

కాగా అంతకుముందు విజయవాడలో రూ.21 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్ల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదిలోనే కొత్తగా 16 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యం నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తూ మార్గమధ్యంలో పులిచింతల ప్రాజెక్టు ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఈడ్పుగల్లులో రూ.313 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే వెయ్యి స్కూళ్ల భవనాలకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈరోజు రాత్రి పదిన్నర గంటల వరకు విజయవాడలో సీఎం పర్యటన కొనసాగుతుంది.