వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది నా వల్ల కాదు: కోర్ కమిటీలో తెలంగాణ అంశంపై సోనియా గాంధీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతులెత్తేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం చాలా క్లిష్టమైనదని దానిపై తాను ఒక్క దానిని నిర్ణయం ఎలా తీసుకోగలనని మూడు రోజుల క్రితం జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంత జఠిలమైన సమస్యపై నిర్ణయం తీసుకోవడం నా ఒక్కదాని వల్ల అవుతుందా అని ఆమె కోర్ కమిటిలోని సభ్యులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశంపై గత కొన్నాళ్లు ఇటు టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులతో పాటు, కేంద్రమంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, ప్రణబ్ ముఖర్జీ కూడా సోనియా గాంధీపైనే భారం మోపారు.

ఇటీవల తమను కలిసిన టి-కాంగ్రెసుకు కూడా కేంద్రమంత్రులు అమ్మ చెబితేనే అవుతుందని తేల్చి చెప్పారు. విదేశీ పర్యటన ముగించికొని వచ్చిన సోనియా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావించిన టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు సోనియా తన అశక్తత వ్యక్తం చేయడంతో వారు నీరుగారి పోయారు. ఇన్నాళ్లు వారు సోనియాపై నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో కూడా వారు అదే మాటను చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ సోనియా అనూహ్యంగా తన అశక్తత వ్యక్తం చేయటంతో వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేది కాదని కూడా కొందరు అర్థం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పలువురు తాము అధిష్టానానికి డెడ్ లైన్లు పెట్టలేదని చెప్పి తప్పించుకోవాలని చూడగా, మరికొందరు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టుగా అర్థమవుతోంది. జూన్ 30 వరకు తెలంగాణపై తేల్చకుంటే వచ్చే నెల 5 నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని, నిరాహార దీక్ష భగ్నం చేయాలని చూస్తే రాజీనామాలకు సిద్ధమని టి-కాంగ్రెసు చెప్పింది. అయితే వారిని చల్లబర్చడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఇటు తెలంగాణవాదులను, అటు తమ ప్రజాప్రతినిధులను కూల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తమకు తెలంగాణ మినహా మరేదీ వద్దని చెబుతున్న టి-కాంగ్రెసు తమ రాజీనామాలకు ఎంత వరకు కట్టుబడి ఉంటుందో చూడాల్సిందే.

English summary
AICC president Sonia Gandhi took back step on Telangana issue. She did not told her openion. She said that it is very serious issue. How I will solve it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X