నా భార్యకు ఇతరులతో సంబంధం, ప్రియుడితో కలిసి కిడ్నాప్: ఎన్నారై

మే 1న చర్చికి తాను రమ్మన్నా సాహితీ రాలేదని, మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి ఇం టికి తాళం వేసి ఉందని నా భార్య చెబుతోందని ఫిర్యాదులో పేర్కొన్నా రు. దీనిపై పోలీసు కేసు పెట్టమన్నా తాత్సారం చేసిందని, విశాఖలో ఉంటున్న తన తల్లి అన్నపూర్ణమ్మతో మే 4న పాలకొల్లు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయించాచని తెలిపారు. 50 రోజులైనా సాహితీ జాడలేదని, తన భార్య, ఆమె తాజా ప్రియుడిపైనే అనుమానంగా ఉందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేయించి కూతురి జాడ తెలియజేయగలరని ఆ ఫిర్యాదులో వెంకటరమణ పేర్కొన్నారు. స్థానిక పోలీసులను తన భార్య, ఆమె ప్రియుడు మేనేజ్ చేస్తున్నారని ఆయన అనుమానం వెలిబుచ్చారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ తాత్కాలిక చైర్‌పర్సన్ కాకుమాను పెదపేరిరెడ్డి, ఈ ఉదంతంపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించమని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించారు.












Click it and Unblock the Notifications