చిరు వర్గానికి కడప జిల్లా నేతలు షాక్, రామచంద్రయ్యపై తీవ్ర వ్యతిరేకత

సి. రామచంద్రయ్యను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి వద్దని చెపుతున్న నాయకుల్లో ఓ మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై చిరంజీవి మెట్టు దిగే పరిస్థితి లేదు. అందువల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. దానికి తోడు, సి. రామచంద్రయ్యకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మద్దతు కూడా ఉంది. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంలో రామచంద్రయ్య కీలక పాత్ర పోషించారు. చిరంజీవికి ఆయన వెన్నుదన్నుగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications