తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదు: డిఎల్

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను కోరినట్లు, అందుకు ఆయన సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బందిని పెంచుతామని ఆయన చెప్పారు. మెరుగైన వైద్య అందించడానికి 225 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు.
కాగా, తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరో సీమాంధ్ర మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. సమైక్యాంధ్ర కోసం ఢిల్లీకి వెళ్లాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి తనకు సమాచారం రాలేదని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావువి అర్థం లేని మాటలని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఏ విధమైన విభేదాలు లేవని, తాను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి పాలలను అందిస్తున్నారని ఆయన కొనియాడారు.












Click it and Unblock the Notifications