హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారెప్పుడు ఎక్కడ ఉంటారో ప్రజలకు తెలుసు: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: నగరానికి చెందిన నేతలమని చెప్పుకోవడం తప్పితే మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ హైదరాబాదీల సమస్యలపై ఎప్పుడు స్పందించారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్ రావు ఓ టీవీ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ భవన్‌లో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూమి కబ్జా చేసినప్పుడు గానీ, ఫుట్ పాత్ వ్యాపారుల సమస్యలపై కానీ, ఇప్పటి మెట్రో రైలు సమస్యలపై కానీ వారెప్పుడు మాట్లాడలేదన్నారు. దానం, ముఖేష్ రోజు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో హైదరాబాదు ప్రజలందరికీ తెలుసున్నారు.

కేంద్ర బలగాలను వెనక్కి పంపించాల్సిందేనని హరీష్ రావు అన్నారు. 14ఎఫ్ తొలగించిన తర్వాత ఎస్ఐ రాత పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ విద్యార్థులు నష్టం పోతారన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు తాము వ్యతిరేకించడం లేదని అయితే ఫుట్ పాత్ వ్యాపారులకు నష్టం కలిగించకుండా, హైదరాబాద్ చారిత్రక సంపదకు నష్టం కలిగించకుండా అలైన్ మెంట్ మార్చాలని కోరుతున్నట్లు చెప్పారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ శాడిస్టు అన్నారు. కాగా ఆచార్య జయశంకర్‌కు నివాళుల అర్పించేందుకు టిఆర్ఎస్ భవన్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

English summary
TRS MLA Harish Rao blamed minister Danam Nagender and Mukesh Goud. He said they did not fight for Hyderabadies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X