హైదరాబాద్: తెలంగాణకు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ విలన్ అని టి-కాంగ్రెసు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ మంగళవారం అన్నారు. లగడపాటి ఇలాగే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే విమానంలో హైదరాబాదులో దిగగానే అక్కడి నుండే వెనక్కి పంపించే రోజులు వస్తాయని హెచ్చరించారు. లగడపాటి తన పద్ధతి మార్చుకోకుంటే హైదరాబాదులో తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ఆయన తన స్థాయిని మించి మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై జూన్ 30 వరకు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తామని చెప్పారు. జూలై 1 వరకు నిర్ణయం రాకుంటే అదే రోజు తమ రాజీనామాలపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆ రోజే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
కేంద్రం స్పందించకుంటే జూలై 5 నుండి ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి అందరం ఎంపీలు దాదాపు నిర్ణయించుకున్నామని చెప్పారు. కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే భూస్థాపితం కావడం ఖాయమన్నారు. 14ఎఫ్ తొలగించకుండా ఎస్ఐ రాత పరీక్షలు నిర్వహిస్తే ఊరుకునేది లేదన్నారు. అలా చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.
T-Congress MP Komatireddy Rajagopal Reddy warned Vijayawada MP Lagadapati Rajagopal that to change his attitude on Telangana issue. He said if he not changed we will returned him from Hyderabad.
Story first published: Tuesday, June 28, 2011, 14:32 [IST]