హైదరాబాద్: పాత బస్తీకి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకొని తమ దేశానికి తీసుకు వెళుతున్న ఆరుగురు సూడాన్ దేశపు విద్యార్థులను దక్షిణ మండల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన సూడాన్ దేశీయులు విద్యార్థి వీసాలపై భారత్‌కు వచ్చారు. వారు పాత బస్తీకి చెందిన ఆరుగురు యువతులను పెళ్లి చేసుకొని వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులతో ఉన్న సదరు అమ్మాయిలకు ఉర్దూ మాత్రమే వస్తుంది. సూడాన్ భాష కానీ, ఆంగ్ల భాష కానీ రాదు. దీంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థి వీసాలపై వచ్చిన విద్యార్థులు ఇప్పటికే సుమారు వందల మంది పాత బస్తీ అమ్మాయిలను తీసుకు వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పాత బస్తీలో బీదరికంలో ఉన్న, అమాయకమైన అమ్మాయిలను పరిచయం చేసుకొని తద్వారా కుటుంబంతో పరిచయం చేసుకొని వారిని పెళ్లి చేసుకొని సూడాన్ తీసుకు వెళుతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారిని అక్కడకు తీసుకు వెళ్లిన తర్వాత అమ్ముతున్నారా లేక తమతో ఉంచుకుంటున్నారా అనే విషయంపై విచారణ జరుపుతున్నారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులను మీడియా ముందుకు తీసుకు వస్తామని పోలీసులు చెప్పారు.
Hyderabad south zone police arrested six sudan students today. Police arrested the students while they are going with old city girls, whom they married.
Story first published: Tuesday, June 28, 2011, 11:08 [IST]