అదిలాబాద్: జిల్లాలోని నేరేడుగొండ మండలం నంద్యతాండలో విషాహారం తిని ముగ్గురు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి చీకటిగా ఉన్న సమయంలో వారు తిన్న రొట్టెలలో పురుగుల మందు కలిసింది. వారి పంట పొలాలకు మందు కొట్టడానికి తెచ్చిన పురుగుల మందు అనుకోకుండా రొట్టెలలో కలిసి పోయింది. ఆ విషయం తెలియని బీమా, కమలాబాయి అనే దంపతులు ఆ రొట్టెలు తిని చనిపోయారు.
వారితో పాటు చుట్టుపు చూపుగా వచ్చిన దివ్య అనే ఆరేళ్ల అమ్మాయి కూడా మృతి చెందింది. వారు రాత్రి తిని పడుకున్నారు. మంగళవారం ఉదయం చూసే సరికి వారు మృతి చెందారు. కాగా బీమా, కమలాబాయిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ఆ రొట్టెలు తినని కారణంగా వారి బతికి బయటపడ్డారు.