సోనియా, జగన్ మధ్య రాజీకి ఆజాద్ యత్నం: యనమల

యువ కిరణాలు పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర యువతను మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ అక్రమంగా సంపాదించిన డబ్బుపై సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికార కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జగన్, సోనియా కుమ్మక్కు కావడం వల్లనే విచారణకు కాంగ్రెసు సిద్ధపడటం లేదన్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీరు పదేలను కొట్టి పెద్దలకు పెడుతుందన్నట్లుగా ఉందని మరో నేత అరవింద్ కుమార్ గౌడ్ వేరుగా అన్నారు. 14ఎఫ్ పై మాట్లాడటానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలులో పెట్టిన తెలంగాణ నగారాకు ప్రజా స్పందన కరువు కావడంతో ఆయన టిడిపిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications