కాంగ్రెసు ఏడుకొండలను అమ్మేస్తుంది: చంద్రబాబు

జల యజ్ఞాన్ని కాంగ్రెసు ప్రభుత్వం ధన యజ్ఞంగా మార్చారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ రచ్చబండలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. కిరణ్ కుర్చీ కాపాడుకోవడంలో బిజీ అయిపోయాడన్నారు. కాంగ్రెసు నేతలు సిండికేట్ అయి రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. బలహీన వర్గాలకు టిడిపి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని విమర్శించారు. కాంగ్రెసు పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. కాంగ్రెసు రాష్ట్రానికి శాపం అన్నారు. మద్య నిషేధంపై చర్చ జరగాలని అన్నారు. కాగా కుప్పం నియోజకవర్గంలో పలువురితో మద్యం తాగమని ప్రమాణం చేయించారు.












Click it and Unblock the Notifications