వేడెక్కిన హస్తిన: తెలంగాణ, మంత్రివర్గ విస్తరణ

కాగా, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శానసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి బుధవారం నాడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. రాష్ట్ర మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, శంకర రావులతో పాటు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ అంశంపై సీమాంధ్రకు, తెలంగాణకు చెందిన ముఖ్య నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే జెసి దివాకర్ రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసే విషయంపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత రాకుండా చర్చలు జరుపుతున్నట్లు కూడా చెబుతున్నారు.
కాగా, కేంద్ర మంత్రి వర్గ పునర్వస్థీకరణ కూడా ఎజెండాలో ఉంది. దీంతో రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కావూరి సాంబశివ రావు, చిరంజీవిలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చునని అంటున్నారు. కెవిపి రామచందర్ రావు కూడా కేంద్ర మంత్రి పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
మరోవైపు, రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై కూడా ఢిల్లీలో కసరత్తు జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ జాబితాతో ఢిల్లీకి వస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానాన్ని ఆశిస్తున్న శాసనసభ్యులు కూడా ఢిల్లీలో మకాం వేశారని చెబుతున్నారు. ఏమైనా, తెలంగాణకు ఓ పరిష్కారం కనుగొనే దిశలోనే కాంగ్రెసు అధిష్టానం కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications