కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు రైతు షాక్

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే రైతులకు మేలు జరిగిందని ఆయన రైతు చంద్రబాబుతో అన్నారు. దీంతో చంద్రబాబు అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక తాను రైతులను ఆదుకుంటానని చెప్పి సర్దుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలని, పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తన పర్యటనలో కాంగ్రెసుపై, వైయస్సార్ కాంగ్రెసుపై తీవ్ర ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications