చెన్నైలో తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్ అరెస్టు

సి. కళ్యాణ్ బుధవారం హైదరాబాదుకు వస్తారనే సమాచారం అందుకున్న సిఐడి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద మాటు వేశారు. వచ్చిన వెంటనే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఆయన ముంబై నుంచి నేరుగా చెన్నై చేరుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆయనను చెన్నైలో అరెస్టు చేశారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో కలిసి కళ్యాణ్ సినీ పరిశ్రమలో పలు అఘాయిత్యాలకు పాల్పడినట్లు సిఐడికి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. శింగనమల రమేష్ ద్వారా వివరాలు సేకరించిన సిఐడి పోలీసులు కళ్యాణ్ అరెస్టుకు సిద్ధపడినట్లు భావిస్తున్నారు. ఓ అగ్ర దర్శకుడి నుంచి ఏడు కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా కళ్యాణ్ బెదిరిస్తూ వచ్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.