వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫేస్‌బుక్‌కి కాంపిటేషన్‌గా గూగుల్ ప్లస్ ప్రాజెక్టు

గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వెబ్‌సైట్‌లో ఎంతమందితోనైనా వీడియో ఛాట్ చేసుకోవచ్చు. ప్లస్ ప్రాజెక్ట్ తో సోషల్ నెట్ వర్కింగ్ లోనూ అగ్రస్థానాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతోనే గూగుల్ దీనిని ప్రారంభించిందని అంటున్నారు. ప్రస్తుతానికి అందరికీ దీన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు. సైట్ టెస్టింగ్ దశలోనే ఉండడంతో, కొంతమందికి మాత్రమే దీన్ని పరిమితం చేసింది. ముందుగా రిజిస్టర్ చేసుకుంటే, గూగుల్ పరిశీలించి సభ్యత్వాన్ని ఇస్తుందన్నమాట. కావాలంటే మీరు కూడా ఓ సారి దాన్ని చూడొచ్చు. సైట్ అడ్రస్ https://plus.google.com/