కాంగ్రెసు తెలంగాణ ఎంపిలకు కెసిఆర్ డైరెక్షన్

అన్ని పార్టీలు-జేఏసీలు-సంఘాలను ఏకం చేయాలని, ఈ ప్రక్రియ చేపట్టడానికి ఏర్పాటు కాబోయే ఐక్య కూటమికి కేసీఆరే నాయకత్వం వహించాలనే అభిప్రాయం తెలంగాణ జేఏసీ సమావేశంలో వ్యక్తమైందని చెప్పారు. ఇందుకు కేసీఆర్ స్పందిస్తూ.. "జయశంకర్ సార్ కూడా ఎప్పుడూ అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలనేవారు. ఒక్క కాంగ్రెస్‌తోనే కాదు. మిగిలిన పార్టీల నేతలతోనూ ఒకసారి మాట్లాడతా. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి నాతో ఫోన్‌లో మాట్లాడారు. పెద్దఎత్తున పారామిలటరీ బలగాలు వస్తున్న విషయంపై సీరియస్‌గా ఆలోచించాలన్నారు. ఈ సమయంలో నా మద్దతు అవసరమని వారు కోరారు. కలిసి మాట్లాడుకుందామన్నారు. వారు పెట్టుకునే సమావేశానికి వచ్చి ధైర్యం ఇవ్వాలన్నారు. వాళ్లు మీటింగ్ పెట్టుకొని పిలిస్తే వెళ్లాల్సి వస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ సమావేశం ఉండవచ్చు'' అని వివరించారు.
అయితే, ఈ విషయాలేవీ బయటికి వెళ్లొద్దని, మీడియా వాళ్లు అడిగితే ఉబ్బిపోయి చెప్పొద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications