హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జానా ఇంటికి కెసిఆర్: తెలంగాణపై ఒత్తిడికి వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy-K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పావులు కదిపేందుకు సిద్ధపడ్డారు. ఆయన బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా తెలంగాణకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తెలంగాణపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తగిన వ్యూహాన్ని రచించేందుకు ఆయన జానారెడ్డితో చర్చలు జరిపేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులే పూనుకోవాలని కెసిఆర్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

సామూహిక రాజీనామాల ద్వారా మాత్రమే కేంద్రం దిగి వస్తుందని, అందుకు మంత్రులు ముందుకు రావాలని కెసిఆర్ సూచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కారం కనిపెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కెసిఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

రాజీనామాలు చేయడం వల్ల ఉప ఎన్నికలు వస్తే వారిని గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రులకు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు, శానససభ్యులకు ఆయన భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా చేసే విషయంలో వెనక్కి తగ్గవద్దని కెసిఆర్ జానా రెడ్డికి నచ్చజెప్పేందుకు ఆయన జానారెడ్డిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాము అడుగు పెట్టలేని స్థితిలో కెసిఆర్ భరోసాకు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సానుకూలంగా ప్రతిస్పందించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

కాగా, కేంద్రంలో తెలంగాణపై సంభవిస్తున్న పరిణామాలు జానా రెడ్డికి తెలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి సన్నిహితులు కావడంతో ఢిల్లీలో జరిగే విషయాలు జానారెడ్డికి తెలుస్తాయి. వాటిని తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకోవడానికి కూడా జానాతో భేటీ కెసిఆర్‌ పూనుకున్నట్లు చెబుతున్నారు. జానారెడ్డిని కలవడం ద్వారా మంత్రులను రాజీనామాలకు సిద్ధం చేసేందుకు కెసిఆర్ సిద్ధపడినట్లు సమాచారం.

English summary
TRS president KCR met K Jana reddy met today to chalk out programme to achieve Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X