తెలంగాణకు వ్యతిరేకంగా 225 ఓట్లు: ఎంపి లగడపాటి

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై అసెంబ్లీలో ఎప్పుడు తీర్మానం ప్రవేశ పెట్టినా 225 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే పరిశీలిస్తామని మాత్రమే చెప్పిందని అన్నారు. జాతీయ కాంగ్రెసు తెలంగాణకు సిద్ధంగా లేదన్నారు. డిసెంబర్ 9న యుపిఏ ప్రభుత్వం పరిశీలిస్తామని చెప్పిందని ఆ స్టేట్‌మెంట్‌తో కాంగ్రెసుకు సంబంధం లేదన్నారు. తెలంగాణపై తీర్మానం వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని మాత్రమే చెప్పారన్నారు.

ప్రత్యేక రాష్ట్రానికి ఓ శాస్త్రీయ పద్ధతి ఉందన్నారు. బ్యాలెట్ తీర్మానం ప్రవేశ పెట్టాలని లగడపాటి అభిప్రాయపడ్డారు. తెలంగాణపై మా అభిప్రాయం మాకుందని చెప్పారు. కాంగ్రెసులో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చన్నారు. కానీ అంతిమంగా నిర్ణయం మాత్రం అధిష్టానానిదే అని చెప్పారు. రాజధాని నగరం హైదరాబాదులో శాంతిభద్రతల దృష్ట్యా మాత్రమే కేవలం పోలీసు శాఖను మాత్రమే ఫ్రీజోన్‌గా నిర్ణయించారని అన్నారు. తనపై తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మాత్రమే ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని ఆయన అన్నారు. వారు ఏ నిబంధన కింద నాకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో తెలియడం లేదన్నారు. హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిపై ఫిర్యాదు చేసినట్లుగా టి-ప్రజాప్రతినిధుల తీరు ఉందన్నారు.

అసెంబ్లీ ఉన్నప్పుడు నోటీసు ఇచ్చుకోవచ్చునని అన్నారు. 14ఎఫ్ పై మాట్లాడే హక్కు మాకుందన్నారు. 14ఎఫ్ పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి పార్లమెంటుకు పంపించాలని అన్నారు. తీర్మానాన్ని పంపిస్తే దానిని ఆమోదించాలా లేదా అనేది పార్లమెంటు చూసుకుంటుందన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం అంగీకరించాలనే రూల్ లేదన్నారు. అయినా 14ఎఫ్ పై ఓటింగ్ పెట్టలేదని అలా చేస్తే తీర్మానం వీగిపోయేదని అభిప్రాయపడ్డారు. 14ఎఫ్ తొలగించడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. ప్రతి విషయంపై నాకంటూ ఓ విధానం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+