అమెరికా తెలుగు సంబరాల్లో తారల హల్‌చల్‌కు రెడీ

తమన్ నేతృత్వంలో సంగీత కచేరీ జరుగుతుంది. గీతా మాధురి, మాలవిక, సుమంగళి, రేవంత్, శ్రీకృష్ణ, వసంత్, సింహ వంటి వారు తమ గానమాధుర్యంతో అలరిస్తారు. ఎల్ఆర్ ఈశ్వరి, ఘంటసాల రత్నకుమారి కూడా తమ ప్రదర్సనలు ఇస్తారు. బాపు, రాఘవేంద్ర రావు, అశ్వినీ దత్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి ప్రముఖులు కూడా తెలుగు సంబరాలను అలరిస్తారు.
గజల్ శ్రీనివాస్ రూపొందించిన తెలుగు తోరణం నృత్య ప్రదర్శన ఉంటుది. శోభా నాయుడు ప్రత్యేకమైన నృత్య ప్రదర్శన చేస్తారు. మిమిక్రీ రమేష్, మైమ్ మధు కార్యక్రమాలు వెంకట్ అర్థనారీశ్వర ప్రదర్శన, మాధవ్ వెంట్రిలాక్యువజిం ఉంటాయి. అమెరికా తెలుగు సంబరాల సందర్భంగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను కూడా కలుసుకోవచ్చు. సాహిత్య కార్యక్రమాలు, యువజన కార్యక్రమాలు, సిఎంఇ కార్యక్రమాలు, అల్యుమినీ సమావేశాలు, మహిళా వేదిక తదితర కార్యక్రమాలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications