హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ, జగన్‌పై ఆస్కార్ ఫెర్నాండేజ్ మౌనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Oscar Fernandes
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న కాంగ్రెసు పార్టీ నేతలపై స్పందించేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండేజ్ శుక్రవారం విముఖత చూపారు. హైదరాబాదులోని జూబ్లీహాలులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దళిత క్రిస్టియన్లు జగన్ వైపు వెళుతున్న నేపథ్యంలో వారిని కాంగ్రెసు వైపు ఉంచేందుకు రాజ్యసభ సభ్యుడు జెడి శీలం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు దళిత క్రిస్టియన్ నేతలు జూబ్లీహాలులో సమావేశం అయి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫెర్నాండెజ్ అనంతరం విలేకరులతో ముక్తసరిగా మాట్లాడారు.

తెలంగాణ అంశం తానేమీ స్పందించనని పార్టీ చూసుకుంటుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ అంశాన్ని చూసుకుంటారని చెప్పారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కూడా స్పందించేందుకు ఆయన సిద్ధపడలేదు. త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో కొత్త కమిటీలు వేస్తామని చెప్పారు. పార్టీ బలోపేతానికి నూతన నాయకత్వం వైపు దృష్టి సారిస్తామన్నారు. పిసిసి అధ్యక్షుడు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని చెప్పారు. అస్కార్ ఫెర్నాండేజ్‌తో బొత్స, మంత్రులు పొన్నాల, డిఎల్ రవీంద్రారెడ్డి, కన్నా, మాజీ సిఎం నేదురుమల్లి, మాజీ పిసిసి చీఫ్ డిఎస్, ఎమ్మెల్యేలు విష్ణు, మస్తాన్ అలీ తదితరులు భేటీ అయ్యారు.

English summary
AICC general secretary Oscar Fernandes was keep silent on Telangana and YS Jagan camp MLAs issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X