కాంగ్రెసు రాజకీయాలు: సీమాంధ్ర వర్సెస్ తెలంగాణ

K Keshav Rao-Shailajanath
హైదరాబాద్: తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే దిశగా చర్యలు ముమ్మరం చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు రాజకీయాల్లో సందడి ప్రారంభమైంది. ఒక వైపు తెలంగాణ నాయకులు, మరో వైపు సీమాంధ్ర నాయకులు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణకు తాత్కాలిక పరిష్కారంగా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ తమ కార్యాచరణను కొనసాగించే దిశలోని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకుంటుందేమోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పార్టీ అధిష్టానంపై ఒత్తిడికి వారు ఢిల్లీ యాత్రను తలపెట్టారు. ఈ నెల 4,5 తేదీల్లో సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలను కలిసే ఆలోచనలో ఉన్నారు.

కాగా, తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ కార్యాచరణను రచించుకునే వ్యూహంలో పడ్డారు. ఈ నెల 5వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టాలని వారు అనుకున్నారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. నిరవధిక నిరాహార దీక్షలు, రాజీనామాలతో పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని ఓ వర్గం ఆలోచిస్తుండగా, మరో వర్గం అంతటి తీవ్రమైన కార్యాచరణకు దిగడానికి విముఖత ప్రదర్శిస్తోంది. తాము అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వారు గురువారం హైదరాబాదులో సమావేశమయ్యారు.

మరోవైపు, కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ ఇదివరకే మంత్రి జానారెడ్డి కలిసి చర్చలు జరిపారు. తాజాగా, కోదండరామ్ శుక్రవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వివేక్ కూడా హాజరయ్యారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడితేనే కాంగ్రెసు అధిష్టానం దిగివస్తుందని, అందుకు సిద్ధపడాలని కోదండరామ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా కేశవరావును కలిశారు. అటు ఢిల్లీలో కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమవుతుండగా, ఇటు హైదరాబాదులో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+