బొత్స చర్చలు: మెట్టు దిగని కాంగ్రెసు తెలంగాణ నేతలు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి జానారెడ్డితో జరిపిన చర్చలు కూడా విఫలమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కె. కేశవ రావు, ఇతర తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత నేతలతో చర్చలు జరపాలని అహ్మద్ పటేల్‌తో పాటు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకు సూచించారు. దాంతో వీరిద్దరు రంగంలోకి దిగి చర్చలు ప్రారంభించారు.
తెలంగాణ సమస్య జఠిలమైందని, సున్నితమైందని, దీనిపై కేంద్రం పరిశీలన జరుపుతోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని బొత్స సత్యనారాయణ తెలంగాణ నేతలకు చెప్పారు. సమస్య శాశ్వత పరిష్కారానికి తాను ప్రయత్నిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. రాజీనామాల ద్వారా పార్టీని ఇబ్బందుల్లో పెట్టడం సరి కాదని ఆయన వారికి సూచించారు. రాజీనామాల వల్ల రాజకీయ సంక్షోభం తలెత్తుతందే తప్ప తెలంగాణ రాదని కూడా ఆయన చెప్పి చూశారు. అయితే, బొత్స మాటలకు తలొగ్గడానికి వారు నిరాకరించారు.












Click it and Unblock the Notifications