కెసిఆర్, కోదండరామ్ మాటలు వినాలా?: ముఖేష్ గౌడ్

Mukesh Goud
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేయాలనే తమ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల నిర్ణయాన్ని హైదరాబాదుకు చెందిన రాష్ట్ర మంత్రి ముఖేష్ గౌడ్ తప్పు పట్టారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామి రెడ్డి మాటలు వినాలా అని ఆయన ప్రశ్నించారు. కోదండరామ్ పేరును ప్రస్తావించే సమయంలో రెడ్డి అనే పదాన్ని ఆయన ఒత్తి పలికారు.

తెలంగాణ కోసం పార్టీ అధిష్టానంతో తమ పార్టీ నాయకులు పోట్లాడాలి గానీ రాజీనామాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం వెలువడిన తర్వాత రాజీనామాపై తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం మంచిది కాదని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తామని అనడం పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడమేనని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం సూచనలు, సలహాల మేరకు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు.

కెసిఆర్ మంత్రి జానా రెడ్డి ఇంటికి వెళ్లడాన్ని, మిగతా కాంగ్రెసు ప్రజాప్రతినిధులను పిలిపించి మాట్లాడడాన్ని ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసుకు వారు ఏ విధమైన న్యాయం చేస్తున్నట్లని ఆయన అడిగారు. కాంగ్రెసు టికెట్‌పై గెలిచి ఆ విధంగా వ్యవహరించడం మంచిది కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+