వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ నేతల రాజీనామాలపై స్పందించని బాబు

అవినీతిపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. 1991కు ముందు కాంగ్రెసు పార్టీ ఏకపక్ష పాలనలో రాష్ట్ర అభివృద్ధి కేవలం ఒకటి, రెండు శాతం మాత్రమే ఉండేదన్నారు. లోక్ పాల్ పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్ పాల్‌పై కేంద్రం బురద జల్లడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కుంభకోణాల్లో మునిగి పోయాయన్నారు. అవినీతికి కాంగ్రెసుదే పూర్తి బాధ్యత అన్నారు. హజారే మళ్లీ దీక్షకు దిగకుండా కేంద్రం బిల్లుకు అడ్డంకులు సృష్టించకూడదన్నారు. లోక్ పాల్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, లోక్ పాల్ పరిధిలోని కేసులకు కాల పరిమితి ఉండాలని డిమాండ్ చేశారు.